US Military Actions Against Venezuela: వెనెజువెలాపై మిలటరీ చర్యను ఖండించిన ఐరాస
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:08 AM
వెనుజువెలాపై అమెరికా మిలటరీ చర్యలు తీసుకోవడాన్ని ప్రత్యర్ధిదేశాలతో పాటు మిత్ర పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ సమస్యపై చర్చించేందుకు సోమవారం ...
ఐక్యరాజ్యసమితి, జనవరి 5: వెనుజువెలాపై అమెరికా మిలటరీ చర్యలు తీసుకోవడాన్ని ప్రత్యర్ధిదేశాలతో పాటు మిత్ర పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ సమస్యపై చర్చించేందుకు సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమయింది. దీంతో పాటు కొలంబియా, మెక్సికోలపై కూడా చర్యలు తీసుకుంటామని, ఖనిజాలు అధికంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన ప్రకటనలపైనా చర్చలు జరిపింది. వెనెజువెలాపై అమెరికా చర్య అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. మిత్ర దేశమైన డెన్మార్క్ ప్రతినిఽధి స్పందిస్తూ తాము నాటో కూటమిలో ఉన్నప్పటికీ తమ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం సరికాదని తెలిపారు. అమెరికాలో అరాచకం రాజ్యమేలుతోందనడానికి వెనెజువెలా ఉదంతం నిదర్శనమని రష్యా రాయబారి వసిలీ నెబెంజ్యా ఘాటుగా విమర్శించారు.