Share News

రష్యాలోని ఉస్త్‌-లుగా ఓడరేవుపై ఉక్రెయిన్‌ దాడి

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:13 AM

రష్యా నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా చేయడంలో కీలకమైన ఉస్త్‌-లుగా నౌకాశ్రయంపై ఉక్రెయిన్‌ దాడులు జరిపింది.

రష్యాలోని ఉస్త్‌-లుగా ఓడరేవుపై ఉక్రెయిన్‌ దాడి

  • భారత్‌కు ఇంధనం సరఫరాపై ప్రభావం?

మాస్కో, మార్చి 29: రష్యా నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా చేయడంలో కీలకమైన ఉస్త్‌-లుగా నౌకాశ్రయంపై ఉక్రెయిన్‌ దాడులు జరిపింది. ఈ దాడిలో నౌకాశ్రయం తీవ్రంగా దెబ్బతింది. బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో రష్యా ఎగుమతుల్లో 45ు ఈ నౌకాశ్రయం నుంచే జరుగుతాయి. రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంది. రష్యా నుంచి భారత్‌కు తక్కువ ధరకు, నిరంతరాయంగా చమురు అందడంలో ఉస్త్‌-లుగా కీలకం. యురల్స్‌ ముడి చమురును లోడ్‌ చేయడానికి ఇక్కడ అధునాతన సదుపాయాలున్నాయి. భారత రీఫైనరీలకు ఈ రకమైన చమురును ప్రాసెస్‌ చేయడానికి అనువుగా ఉండటంతో పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతోంది. ఇరాన్‌లో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగినా ఉస్త్‌-లుగా నుంచి సరఫరా అయ్యే చమురుతో భారత్‌లో పెట్రో ధరలు పెరగకుండా నియంత్రించగలుగుతున్నారు. అయితే ఈ నౌకాశ్రయం దెబ్బతినడంతో భారత్‌కు ముడి చమురు సరఫరాపై ప్రభావం ఉండొచ్చని అంచనా.

Updated Date - Mar 30 , 2026 | 04:13 AM