రష్యా పై వందల డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:06 AM
రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లను ప్రయోగించింది.
కీవ్, మాస్కో, జూన్ 22: రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లను ప్రయోగించింది. దీంతో మాస్కోలోని నాలుగు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. 300కు పైగా డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. క్రిమియాపై కూడా ఉక్రెయిన్ దాడులు కొనసాగుతుండటంతో బహిరంగ కార్యక్రమాలను రష్యా అధికారులు రద్దు చేశారు. చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా క్రిమియాలో ఇంధన సరఫరాకు అంతరాయం కలిగి ప్రజలకు ఇంధన విక్రయాలను నిలిపివేశారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో రష్యా జరిపిన తాజా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతిచెందారు.