రష్యాపైకి ఉక్రెయిన్ వెయ్యి డ్రోన్లు
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:13 AM
ఉక్రెయిన్ ఆదివారం వెయ్యికి పైగా డ్రోన్లను రష్యాపైకి ప్రయోగించింది. దీంతో సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని ఇంధన టెర్మినల్‌తో పాటు మరో ఆయిల్ డిపోలో మంటలు ఎగసిపడ్డాయి.
మంటల్లో చిక్కుకున్న ఇంధన టెర్మినళ్లు
కీవ్, మాస్కో, అక్టోబరు 18: ఉక్రెయిన్ ఆదివారం వెయ్యికి పైగా డ్రోన్లను రష్యాపైకి ప్రయోగించింది. దీంతో సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని ఇంధన టెర్మినల్‌తో పాటు మరో ఆయిల్ డిపోలో మంటలు ఎగసిపడ్డాయి. ఓ లాజిస్టిక్ కేంద్రం, డాటా సెంటర్, 12 భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఒకరు మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు. మొత్తం 15 రీజియన్లలో ఉక్రెయిన్ ప్రయోగించిన 1015 డ్రోన్లను కూల్చినట్లు రష్యా ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్‌లోని జపోరిజియాపై రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో 3 భవనాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒకరు మృతిచెందారు. ఇద్దరు గాయపడ్డారు.