రష్యాలోకి 2వేల కిలోమీటర్లు చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్లు
ABN , Publish Date - Jun 22 , 2026 | 03:53 AM
రష్యాలోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ జరిపిన తాజా డ్రోన్ దాడుల్లో నలుగురు మృతిచెందారు. 28 మంది గాయపడ్డారు.
మాస్కో, జూన్ 21: రష్యాలోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ జరిపిన తాజా డ్రోన్ దాడుల్లో నలుగురు మృతిచెందారు. 28 మంది గాయపడ్డారు. రష్యాలో 2వేల కిలోమీటర్లు లోపలికి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లు ఉరల్ ప్రాంతంలోని ట్యూమెన్ చమురు క్షేత్రంపై విరుచుకుపడ్డాయి. రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ రీఫైనరీల్లో ఒకటైన ట్యూమెన్‌పై డ్రోన్ దాడి జరగడంతో రష్యా ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిలో ప్రధాన ప్లాంట్ దెబ్బతినలేదని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్లాంట్‌లో రోజుకు లక్షన్నరకు పైగా బ్యారెళ్ల చమురు శుద్ధి అవుతోంది. మరోవైపు తాము 3 వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే డ్రోన్లను అభివృద్ధి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.