Share News

ఐదు రష్యా ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:25 AM

రష్యాతో యుద్ధం మొదలై నాలుగేళ్లు పూర్తవుతున్న వేళ.. ఆ దేశంపై ఉక్రెయిన్‌ భీకర దాడి చేసింది. ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌లో భాగంగా సాయుధ డ్రోన్లతో రష్యాలోని ఐదు కీలక ఎయిర్‌ బేస్‌లపై బాంబు దాడులు చేసింది.

ఐదు రష్యా ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి

కీవ్‌, జనవరి 29: రష్యాతో యుద్ధం మొదలై నాలుగేళ్లు పూర్తవుతున్న వేళ.. ఆ దేశంపై ఉక్రెయిన్‌ భీకర దాడి చేసింది. ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌లో భాగంగా సాయుధ డ్రోన్లతో రష్యాలోని ఐదు కీలక ఎయిర్‌ బేస్‌లపై బాంబు దాడులు చేసింది. ఈ దాడిలో రష్యాకు చెందిన 15 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. ఈ విమానాల విలువ దాదాపు రూ.9,200 కోట్లు ఉంటుందని పేర్కొంది. అయితే, ఈ దాడి ఎప్పుడు జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్‌ ఆల్ఫా యూనిట్‌ నిర్వహించిన ఈ దాడుల్లో 11 సుఖోయ్‌, మిగ్‌ యుద్ధ విమానాలు, మూడు హెలికాప్టర్లు, ఒక ఆంటనోవ్‌ ఏఎన్‌-26 కార్గో విమానం నాశనమైనట్లు తెలిపింది. ఎస్‌యూ 30ఎస్‌ఎం, ఎస్‌యూ 34 జెట్లు, పాతతరానికి చెందిన ఎస్‌యూ27, ఎస్‌యూ24 విమానాలు, మిగ్‌ 31 ఇంటర్‌సెప్టర్స్‌ను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.

Updated Date - Jan 30 , 2026 | 07:13 AM