Share News

మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్ల వర్షం!

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:36 AM

మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్‌ దాడులను రష్యా సమర్థంగా అడ్డుకుంది. ఆదివారం రాజధాని నగరంపైకి దూసుకొచ్చిన 28 ఉక్రేనియన్‌ డ్రోన్లను తమ...

మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్ల వర్షం!

మాస్కో, మార్చి 15: మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్‌ దాడులను రష్యా సమర్థంగా అడ్డుకుంది. ఆదివారం రాజధాని నగరంపైకి దూసుకొచ్చిన 28 ఉక్రేనియన్‌ డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు మాస్కో మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ ప్రకటించారు. ఈ దాడుల ప్రభావం మాస్కోలోని విమానాశ్రయాలపై తీవ్రంగా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Updated Date - Mar 16 , 2026 | 03:36 AM