Share News

UK MP Bob Blackman: పీవోకేను భారత్‌లో విలీనం చేయాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:01 AM

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలని బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ అన్నారు.

UK MP Bob Blackman: పీవోకేను భారత్‌లో విలీనం చేయాలి

  • 1992లోనే ‘370’ని రద్దుచేయాల్సింది:బ్రిటన్‌ ఎంపీ బాబ్‌

న్యూఢిల్లీ, జనవరి 5: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలని బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌ విషయంలో భారతదేశ వైఖరికి తాను ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. పీవోకేను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించడాన్ని, నియంత్రణను కొనసాగించడాన్ని తాను ఖండిస్తున్నానని వ్యాఖ్యానించారు. భారత్‌లో పర్యటిస్తున్న ఎంపీ బ్లాక్‌మన్‌.. ఆదివారం జైపూర్‌లోని కాన్‌స్టిట్యూషనల్‌ క్లబ్‌లో నిర్వహించిన హై-టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని తాను 1992లోనే కోరినట్టు తెలిపారు. కశ్మీర్‌ పండిట్ల వలసలు ప్రారంభం కాకముందే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఉండాల్సిందని, నాటి ఘటనలను తాను అప్పట్లోనే ప్రశ్నించానన్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ కొనసాగడం మంచిదే అయినా, ఇది ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని, మళ్లీ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

Updated Date - Jan 06 , 2026 | 01:01 AM