యూఏఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:39 AM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. వీరిలో పలువురు భారతీయులు ఉన్నట్టు దుబాయ్‌లోని..
మృతుల్లో పలువురు భారతీయులు
దుబాయ్, నవంబరు 24: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. వీరిలో పలువురు భారతీయులు ఉన్నట్టు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తెలిపింది. రస్ అల్ ఖైమా ప్రాంతంలో 41 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు, గాయపడిన భారతీయుల కుటుంబాలకు అవసరమైన సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా 800-46342 ఉచిత టోల్ హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేసినట్టు భారత కాన్సులేట్ పేర్కొంది.