Share News

నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:22 AM

నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో ఎవరెస్టు బేస్‌క్యాంపునకు వెళ్లే మార్గంలో మంగళవారం రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి

నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ
plane accident

  • చెన్నైకి చెందిన వసంత్‌కుమార్‌ మృతి

  • ఇద్దరు పైలట్లు సహా ముగ్గురికి గాయాలు

కాఠ్మాండూ/చెన్నై, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో ఎవరెస్టు బేస్‌క్యాంపునకు వెళ్లే మార్గంలో మంగళవారం రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఇద్దరు పైలట్లు సహా ముగ్గురు గాయపడ్డారు. మృతుడు వసంత్‌కుమార్‌(47) చెన్నై నివాసి. గాయపడిన మరో ప్యాసింజర్‌ శైలేష్‌ భారత సంతతి వ్యక్తి. న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 8.11గంటల సమయంలో ఫెరిచే హెలిప్యాడ్‌ దగ్గర రెండు హెలికాప్టర్లు ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్‌ జోన్‌ దగ్గర సరైన కమ్యూనికేషన్‌ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. రెండు హెలికాప్టర్లలో ఒకటి ఫిష్‌టెయిల్‌ కంపెనీకి, మరొకటి ఎయిర్‌ డైనాస్టీకి కంపెనీకి చెందినవి. ఇవి రెండూ నేపాల్‌లోని లూక్లా ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాయి. ఈ ఎయిర్‌పోర్టును ఎవరెస్టుకు గేట్‌వేగా పేర్కొంటారు. ఇక్కడి నుంచి బయల్దేరిన హెలికాప్టర్లు ఎవరెస్టు బేస్‌క్యాంపు మార్గంలో ఉన్న ఫెరిచే హెలిప్యాడ్‌ దగ్గర ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించాయి. కాగా, ప్రమాదంలో మరణించిన వసంత్‌ ఫిష్‌టెయిల్‌ హెలికాప్టర్‌లో ఉన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 04:22 AM