Share News

టర్కీలో కుప్పకూలిన ఎఫ్‌-16 యుద్ధ విమానం

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:03 AM

టర్కీ వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-16యుద్ధ విమానం బుధవారం తెల్లవారుజామున కుప్పకూలింది. బాలికేసర్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలు కోల్పోయినట్లు...

టర్కీలో కుప్పకూలిన ఎఫ్‌-16 యుద్ధ విమానం

అంకారా, ఫిబ్రవరి 25: టర్కీ వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-16యుద్ధ విమానం బుధవారం తెల్లవారుజామున కుప్పకూలింది. బాలికేసర్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ రక్షణ శాఖ ధ్రువీకరించింది. బాలికేసర్‌లోని తొమ్మిదో మెయిన్‌ జెట్‌ బేస్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన రక్షణా బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఇస్తాంబుల్‌-ఇజ్మీర్‌ జాతీయరహదారి సమీపంలో విమాన శకలాలు లభ్యమయ్యాయి. ప్రమాదంపై ఆదేశ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

Updated Date - Feb 26 , 2026 | 02:03 AM