ఇరాన్ తిరిగి అణుశుద్ధి చేపట్టలేదు: గబ్బార్డ్
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:26 AM
గత ఏడాది జూన్‌లో ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసిన తర్వాత.. ఆ దేశం తిరిగి అణుశుద్ధి సామర్థ్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలేమీ చేసిన...
గత ఏడాది జూన్‌లో ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసిన తర్వాత.. ఆ దేశం తిరిగి అణుశుద్ధి సామర్థ్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలేమీ చేసిన దాఖలాలు లేవని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చెప్పారు. అమెరికా చట్టసభ సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. ఇరాన్, ఆ దేశ మద్దతున్న తీవ్రవాద సంస్థలు ఇప్పటికీ అమెరికాపై, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని చెప్పారు. సుమారు మూడు వారాల దాడుల తర్వాత కూడా ఇరాన్‌లో ప్రభుత్వం, నాయకత్వం ఇంకా కొనసాగుతోందని చెప్పారు. అయితే వారి మిలిటరీ సామర్థ్యం చాలా వరకు నాశనమైందన్నారు.
ఇవి కూడా చదవండి..
అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..