Share News

అమెరికా నిఘా విభాగం డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ రాజీనామా

ABN , Publish Date - May 23 , 2026 | 04:20 AM

అమెరికా నిఘా విభాగం డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన భర్త అబ్రహం బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని...

అమెరికా నిఘా విభాగం డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ రాజీనామా

వాషింగ్టన్‌, మే 22: అమెరికా నిఘా విభాగం డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన భర్త అబ్రహం బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయనకు సేవలందించేందుకు రాజీనామా చేస్తున్నానంటూ ఆమె... అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు రాజీనామా లేఖ పంపారు. తనపై నమ్మకం ఉంచి ఏడాదిన్నర క్రితం దేశ నిఘా విభాగం డైరెక్టర్‌గా నియమించినందుకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ పెట్టారు.

Updated Date - May 23 , 2026 | 04:20 AM