Share News

ట్రంప్‌ మెడపై ఎర్రని మచ్చ

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:41 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుడివైపు మెడపై గల పొడవైన ఎర్రని మచ్చ నివారణకు స్కిన్‌ క్రీమ్‌ వాడుతున్నారని వైట్‌హౌస్‌ ప్రకటించింది.

ట్రంప్‌ మెడపై ఎర్రని మచ్చ

  • స్కిన్‌ క్రీం వాడుతున్నారన్న వైట్‌హౌస్‌

వాషింగ్టన్‌, మార్చి 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుడివైపు మెడపై గల పొడవైన ఎర్రని మచ్చ నివారణకు స్కిన్‌ క్రీమ్‌ వాడుతున్నారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఎందుకు ఆయన స్కిన్‌ క్రీమ్‌ వాడుతున్నారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. సోమవారం జరిగిన ఆర్మీ పతకాల ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ కుడి వైపు మెడపై గల ఎర్రని మచ్చను గమనించిన మీడియా ఫోటోగ్రాఫర్లు క్లోజప్‌ షాట్లు చిత్రీకించారు. దీనిపై ట్రంప్‌ వైద్యుడు సియాన్‌ బార్బాబెల్లా ఓ ప్రకటన చేస్తూ.. ‘చర్మ వ్యాధి నివారణకు వైట్‌హౌస్‌ డాక్టర్‌ సూచన మేరకు వారం రోజులుగా స్కిన్‌ క్రీమ్‌’ వాడుతున్నారని తెలిపారు. కొన్ని వారాల్లో ఆ ఎర్రని మచ్చ తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Mar 04 , 2026 | 03:41 AM