Share News

అమెరికా దయతోనే కెనడా మనుగడ: ట్రంప్‌

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:27 AM

ప్రపంచవేదికపై అమెరికా, కెనడాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. దావో్‌సలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు....

అమెరికా దయతోనే కెనడా మనుగడ: ట్రంప్‌

  • ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు: కార్నీ

వాషింగ్టన్‌, జనవరి 23: ప్రపంచవేదికపై అమెరికా, కెనడాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. దావో్‌సలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, తన ప్రతిష్ఠాత్మక ‘శాంతి మండలి’లో చేరాల్సిందిగా కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు, దావోస్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా అండ వల్లే కెనడా మనుగడ సాగిస్తోందన్నారు. ఆ విషయాన్ని కార్నీ గుర్తుంచుకోవాలన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై కార్నీ కూడా దీటుగా స్పందించారు. ‘మేము ఎవరి మీద ఆధారపడి బతకడం లేదు. స్వతంత్ర గుర్తింపుతోనే అభివృద్ధి చెందుతున్నాం’’ అని స్పష్టంచేశారు. కాగా, దావో్‌సలో ట్రంప్‌ నాటో బలగాలపై చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, అవి నాటో కుటుంబీకులను తీవ్రంగా బాధపెట్టాయని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ అన్నారు. అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా బలగాలతో కలిసి పాల్గొన్న ఆపరేషన్లలో 457 మంది బ్రిటన్‌ సైనికులు చనిపోయారని గుర్తు చేశారు.

Updated Date - Jan 24 , 2026 | 04:27 AM