Share News

మెలోని నాతో ఫొటో కోసంఅడుక్కున్నారు : ట్రంప్‌

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:04 AM

జీ7 సదస్సులో తనతో ఫొటో దిగడానికి ఇటలీ ప్రధాని మెలోనీ ప్రాధేయపడ్డారని ట్రంప్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ఇటాలియన్‌ వార్తాసంస్థకు..

మెలోని నాతో ఫొటో కోసంఅడుక్కున్నారు : ట్రంప్‌

  • అంతా కట్టుకథేనన్న ఇటలీ ప్రధాని

న్యూఢిల్లీ, జూన్‌ 19: జీ7 సదస్సులో తనతో ఫొటో దిగడానికి ఇటలీ ప్రధాని మెలోనీ ప్రాధేయపడ్డారని ట్రంప్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ఇటాలియన్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఫోన్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నారు. దీన్ని మెలోనీ వెంటనే ఖండించారు. తాను ఆయన్ను ఎప్పుడూ ప్రాధేయపడ లేదని, ట్రంప్‌ చెప్పేదంతా కట్టుకథ అని అన్నారు. మరోవైపు ఇటలీ ఉప ప్రధాని ఆంటానియో తజానీ త్వరలో తాను జరపాల్సిన అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ ప్రధానిని ఉద్దేశించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మొత్తం ఇటలీకే అవమానకరమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భారత ప్రధాని మోదీ చాలా గట్టి పిండం అని... తనకు ఇష్టమైన ప్రపంచ దేశాల నాయకుల్లో ఒకరని ట్రంప్‌ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మీకు బాగా నచ్చిన ప్రపంచ దేశాల నాయకులు ఎవరు అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

Updated Date - Jun 20 , 2026 | 04:05 AM