Share News

ట్రంప్‌, జిన్‌పింగ్‌, పుతిన్‌ భేటీకి రంగం సిద్ధం

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:05 AM

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒకే వేదికపై సమావేశం కానున్నారు.

ట్రంప్‌, జిన్‌పింగ్‌, పుతిన్‌ భేటీకి రంగం సిద్ధం

  • చైనాలో వచ్చే వారం ముగ్గురి భేటీ

న్యూఢిల్లీ, నవంబరు 14: ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒకే వేదికపై సమావేశం కానున్నారు. వచ్చే వారంలో చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో జరగనున్న ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార(ఏపీఈసీ) సదస్సు సందర్భంగా ఈ చారిత్రక భేటీ జరగనుంది. ఈ ముగ్గురు నేతల ప్రత్యేక భేటీ ఖరారైందని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఈ ముగ్గురు దేశాధినేతలు తొలిసారి త్రైపాక్షిక సమావేశంలో పాల్గొననుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అణ్వాయుధాలపై నియంత్రణ, ఇరాన్‌తో యుద్ధం తదితర అంశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. రష్యా, చైనా అధ్యక్షులతో చర్చించే అవకాశముంది. ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించే అవకాశం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఈ నెల 17న జరిగే క్వాడ్‌ సదస్సులో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది.

Updated Date - Nov 15 , 2026 | 03:05 AM