Share News

19న ట్రంప్‌, జిన్‌పింగ్‌, పుతిన్‌ భేటీ

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:35 AM

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మూడు దేశాల అధినేతలు ఒకే వేదికపై కలుసుకొని చర్చలు జరపనున్నారు.

19న ట్రంప్‌, జిన్‌పింగ్‌, పుతిన్‌ భేటీ

  • చైనాలోని షెన్‌జెన్‌లో అపెక్‌ సదస్సులో త్రైపాక్షిక చర్చలు

బీజింగ్‌, నవంబరు 16: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మూడు దేశాల అధినేతలు ఒకే వేదికపై కలుసుకొని చర్చలు జరపనున్నారు. ఈ నెల 18-19 తేదీల్లో చైనాలోని షెన్‌జెన్‌లో జరగనున్న 33వ ఆసియా- పసిఫిక్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ (అపెక్‌) సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమావేశమై త్రైపాక్షిక చర్చలు జరుపుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ సోమవారం వెల్లడించారు. ఈ మూడు దేశాల అధినేతలు త్రైపాక్షిక చర్చలు జరపటం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ప్రపంచ శాతి, కృత్రిమ మేధ, అణ్వాయుధాల నియంత్రణ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 02:37 AM