అబ్రహామిక్ ఒప్పందాలపై సంతకం చేయాలి!
ABN , Publish Date - May 26 , 2026 | 04:04 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్‌ను ఇరకాటంలో నెట్టారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ....
పాకిస్థాన్‌ను ఇరకాటంలో పెట్టిన ట్రంప్
వాషింగ్టన్, మే 25: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్‌ను ఇరకాటంలో నెట్టారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ఉద్దేశించిన అబ్రహామిక్ ఒప్పందాలపై అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో భాగస్వాములైన దేశాలన్నీ సంతకం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా కీలక పాత్ర పోషిస్తున్న మూడు దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఇరాన్ కూడా సంతకం చేస్తే అది తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2020లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఒప్పందంపై యూఏయీ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజక్‌స్థాన్ ఇప్పటికే సంతకాలు చేశాయి. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టు, జోర్డాన్ కూడా ఈ ఒప్పందంలో భాగస్వాములు కావాలని ట్రంప్ ఆకాంక్షిస్తున్నారు.