Share News

త్వరలో అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్‌ సంతకం

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:45 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. పదవిలో ఉండగా ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయనున్న తొలి అధ్యక్షుడిగా నిలవనున్నారు.

త్వరలో అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్‌ సంతకం

  • పదవిలోనే ఈ ఘనత సాధించిన తొలి అధ్యక్షుడిగా చరిత్ర

వాషింగ్టన్‌, మార్చి 27: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. పదవిలో ఉండగా ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయనున్న తొలి అధ్యక్షుడిగా నిలవనున్నారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గుర్తుగా తమ దేశ కరెన్సీ నోట్లపై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ సంతకాన్ని కూడా ముద్రిస్తామని ట్రెజరీ శాఖ తెలిపింది. ఇకపై ముద్రించే కరెన్సీ నోట్లపై ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్సెంట్‌తోపాటు ట్రంప్‌ సంతకం కూడా ఉంటుందని వెల్లడించింది. దీంతో పదవిలో ఉండగా కరెన్సీ నోట్లపై సంతకం చేసిన తొలి అధ్యక్షుడుగా ట్రంప్‌ చరిత్ర సృష్టించనున్నారని తెలిపింది. ట్రంప్‌, బెస్సెంట్‌ సంతకాలతో కూడిన తొలి 100 డాలర్ల నోట్లు జూన్‌లో ముద్రితం కానున్నాయి. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా ట్రంప్‌ చిత్రంతో కూడిన 24క్యారెట్ల బంగారు నాణేన్ని తయారు చేసేందుకు ఫెడరల్‌ ఆర్ట్స్‌ కమిషన్‌ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 28 , 2026 | 04:45 AM