భార్య దెబ్బ నుంచి కోలుకుంటున్నాడు
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:01 AM
ప్లీజ్ ట్రంప్.. అంటూ నన్ను వేడుకున్నారు, ప్రాధేయపడ్డారు’’ అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ గురించి గతంలో చులకనగా మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
మేక్రాన్ భార్య ఆయనతో దారుణంగా ప్రవర్తిస్తుంది
ఇరాన్‌పై యుద్ధానికి నౌకలను పంపనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడిపై డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు
వాషింగ్టన్, ఏప్రిల్ 2: ‘‘ప్లీజ్ ట్రంప్.. అంటూ నన్ను వేడుకున్నారు, ప్రాధేయపడ్డారు’’ అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ గురించి గతంలో చులకనగా మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆయనపై మరోసారి వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. మేక్రాన్ వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఎగతాళిగా మాట్లాడడం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధంలో తనతో కలిసి రాని నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే.. బుధవారం జరిగిన ఒక ప్రైవేటు విందు కార్యక్రమంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ట్రంప్ తాను మేక్రాన్‌కు ఫోన్ చేసినట్టు చెప్పారు. ‘‘ఆయన భార్య ఆయనతో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. (ఆమె గతంలో ఆయన చెంపపై కొట్టిన వీడియో గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ).. కుడి దవడపై తగిలిన దెబ్బ నుంచి ఆయన ఇంకా కోలుకుంటున్నారు. ఆయనకు ఫోన్ చేసి.. ‘ఇమ్మాన్యుయేల్.. గల్ఫ్‌లో మాకు మీ సహాయం కావాలి. మీకు వీలైతే వెంటనే యుద్ధనౌకలను అక్కడకు పంపం డి’ అని అడిగాను’’ అన్నారు. ఫ్రెంచ్ యాసలో (మేక్రాన్‌ను అనుకరిస్తూ) ‘‘నేను అడిగిన దానికి మేక్రాన్.. ‘‘నో, నో, నో.. మేం అలా చేయలేం డొనాల్డ్. యుద్ధంలో మీరు గెలిచాకే మేం మీకు సాయం’ అన్నారు’’ అని తెలిపారు.