Former US President Donald Trump: మోదీ నన్ను..సర్.. ప్లీజ్ అన్నారు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:10 AM
అపాచీ హెలికాప్టర్ల డెలివరీ గురించి భారత ప్రధాని మోదీ తనను నేరుగా సంప్రదించారని.. ఆ సమయంలో తనను సర్.. ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా.....
అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు: ట్రంప్
న్యూయార్క్, జనవరి 7: అపాచీ హెలికాప్టర్ల డెలివరీ గురించి భారత ప్రధాని మోదీ తనను నేరుగా సంప్రదించారని.. ఆ సమయంలో తనను ‘సర్.. ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా’ అంటూ సంబోధించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అపాచీ హెలికాప్టర్ల గురించి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నామని మోదీ చెప్పగా.. తాను ఆ పరిస్థితిని మార్చుతున్నానని చెప్పినట్టు తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ పార్టీ సభ్యుల వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యథావిధిగా.. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయన్న మాటను ట్రంప్ మరోసారి చెప్పారు. కాకపోతే భారత్‌పై తాను విధించిన సుంకాల కారణంగా మోదీ తనతో సంతోషంగా లేరన్నారు. కాగా.. భారత్ 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసిందంటూ ట్రంప్ అబద్ధం చెప్పారు. ఇండియా ఆర్డర్ చేసింది 28 హెలికాప్టర్లనే. వాటిలో 22 వాయుసేన కోసం కాగా.. ఆరు హెలికాప్టర్లు ఆర్మీ కోసం. ఇప్పటికే ఆ 28 హెలికాప్టర్లూ వచ్చాయి. మరో ఆరు హెలికాప్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చే ఆలోచన మాత్రమే ప్రస్తుతానికి ఉంది. మరోవైపు, అమెరికా విధించిన అధిక టారి్‌ఫలతో భారత్ రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను పూర్తిగా తగ్గించిందని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో.. అమెరికా ఒత్తిళ్లకు ప్రధాని మోదీ లొంగిపోతున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. 1971నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలో నాటి ప్రధాని ఇందిర అమెరికా ఒత్తిళ్లకు చలించకుండా నిలిచిన తీరును గుర్తు చేశారు.