Share News

అందమైన ఆ చైనా మహిళ గుఢచారా?

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:06 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, జెన్సన్‌ హవాంగ్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవోగా ఆయన తిరిగొస్తే తనకెలాంటి అభ్యంతరం..

అందమైన ఆ చైనా మహిళ గుఢచారా?

  • అలిస్‌ గూఢచారి అనేందుకు సరైన కారణం లేదు: ట్రంప్‌

న్యూఢిల్లీ, నవంబరు 16: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, జెన్సన్‌ హవాంగ్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవోగా ఆయన తిరిగొస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎన్వీడియా సీఈవోగా హవాంగ్‌ తిరిగి రావడానికి మీరు మద్దతిస్తారా? అని ప్రశ్నించినప్పుడు ట్రంప్‌ పైవిధంగా స్పందించారు. అలిస్‌ హవాంగ్‌ చైనా గూఢచారి అన్న ఆరోపణలను ఆయన ప్రశ్నించారు. చైనా నుంచి దేశంలోకి వచ్చే ఏ అందమైన మహిళనైనా గూఢచారి అని అంటారని.. ఆమె అసలు గూఢచారి అని తనకు తెలియదని, ఈ విషయాన్ని తాను ముందేచెప్పానని పేర్కొన్నారు. అలిస్‌ గూఢచారి అనేందుకు సరైన కారణం లేదని పేర్కొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 03:07 AM