Share News

కాస్త భారత్‌ను చూడండి

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:45 AM

కొన్ని నెలల క్రితం భారత్‌ను ‘మృత ఆర్థిక వ్యవస్థ (డెడ్‌ ఎకానమీ)’గా అభివర్ణించిన ట్రంప్‌... ఇప్పుడు భారత వృద్ధిని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు.

కాస్త భారత్‌ను చూడండి
Donald Trump India News

  • తక్కువ వడ్డీ రేట్లతో 7శాతం వృద్ధి సాధిస్తోంది

  • భారత్‌లా వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా 15-20శాతం వృద్ధి సాధించగలదు: ట్రంప్‌

  • భారత్‌ ‘మృత ఆర్థిక వ్యవస్థ’ అంటూ కొన్ని నెలల క్రితం విమర్శించిన ట్రంప్‌

వాషింగ్టన్‌, నవంబరు 21: కొన్ని నెలల క్రితం భారత్‌ను ‘మృత ఆర్థిక వ్యవస్థ (డెడ్‌ ఎకానమీ)’గా అభివర్ణించిన ట్రంప్‌... ఇప్పుడు భారత వృద్ధిని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధి, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లకు సంబంధించి భారత్‌ విధానాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌పై విమర్శలు గుప్పించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ ఇటీవల వడ్డీరేట్లను పెంచడాన్ని తప్పుపడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికా ఫెడరల్‌ రిజర్వు రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరిస్తోంది. దానితో ఫెడ్‌ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మంచి ఆర్థిక వృద్ధిని సాధించినప్పుడు.. వడ్డీ రేట్లు తగ్గించి, మరింత వృద్ధికి దోహదం చేయాల్సి ఉంటే.. అందుకు విర్ధుంగా ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచుతూ వెళుతోంది. ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తే అమెరికా ఏకంగా 15-20శాతం వృద్ధిరేటును సాధించగలం. అప్పులను వేగంగా తీర్చేయగలం. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కాస్త భారత్‌ వైపు చూడండి. వారి వద్ద వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. భారత్‌ ఏకంగా ఏడు శాతం జీడీపీ వృద్ధి రేటు సాధిస్తోంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


హోర్ముజ్‌పై అమెరికా పూర్తి నియంత్రణ

హోర్ముజ్‌ జలసంధిపై అమెరికా నావికాదళం పూర్తి నియంత్రణ సాధించిందని ట్రంప్‌ మరోసారి పేర్కొన్నారు. ఇరాన్‌ నౌకలు, ఆ దేశంతో లావాదేవీలు చేసే నౌకలు ప్రయాణించకుండా దిగ్బంధం కొనసాగుతోందని చెప్పారు. తమ నేవీ సాయంతో గల్ఫ్‌ నుంచి పెద్ద సంఖ్యలో చమురు నౌకలు హోర్ముజ్‌ దాటుతున్నాయన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 07:52 AM