ఇరాన్‌పై దాడులను స్వయంగా పర్యవేక్షించిన ట్రంప్
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:26 AM
ఇరాన్‌పై అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన దాడులను ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ....
వాషింగ్టన్, మార్చి 1: ఇరాన్‌పై అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన దాడులను ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైట్‌హౌస్ ఆదివారం విడుదల చేసింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన రిసార్టు ‘మార్ ఎ లాగో’లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో కలిసి ట్రంప్ సమీక్షిస్తున్న దృశ్యాలు ఈ ఫొటోల్లో ఉన్నాయి. బాంబు దాడులను శాటిలైట్ చిత్రాల ద్వారా ట్రంప్ ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అంతకుముందు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ..ట్రంప్, జాతీయ భద్రతా బృందం రోజంతా పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉంటారని తెలిపారు. అంతేకాకుండా ఇరాన్‌పై మిలిటరీ దాడులు కొనసాగిస్తూనే... ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోపాటు సౌదీ, గల్ఫ్ నేతలతో, నాటో సెక్రటరీతో ట్రంప్ దౌత్యపరమైన చర్చలు జరిపినట్లు తెలిపారు.