మా చమురు కోసం నౌకల క్యూ : ట్రంప్
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:39 AM
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో చమురు కోసం అనేక దేశాలు అమెరికాకు వస్తున్నాయని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
వాషింగ్టన్, ఏప్రిల్ 11: హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో చమురు కోసం అనేక దేశాలు అమెరికాకు వస్తున్నాయని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చమురు, ఇరాన్‌తో యుద్ధం తదితర అంశాలపై శనివారం ఆయన సోషల్‌మీడియాలో స్పందించారు. అమెరికా చమురు కోసం ఖాళీ చమురు ట్యాంకర్ నౌకలు వరుస కట్టాయని చమురు మార్కెట్ పరిశోధకుడు రోరీ జాన్సన్ చేసిన ట్వీట్‌కు ట్రంప్ స్పందించారు. రష్యా, సౌదీ అరేబియాల వద్ద ఉన్న నిల్వలను కలిపినా అమెరికా వద్ద ఉన్నంత చమురు లేదన్నారు. హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేసి చమురు సరఫరాను అడ్డుకున్నా అమెరికా అందుకు ప్రత్యామ్నాయం చూపగలదని చెప్పారు.