Share News

ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం: ట్రంప్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:34 AM

ఇరాన్‌లో ఇంకా మిగిలి ఉన్న వాటిని నాశనం చేయడం ఇంకా మొదలుపెట్టలేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇకపై వంతెనలు, ఆ తర్వాత విద్యుత్‌ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 3: ఇరాన్‌లో ఇంకా మిగిలి ఉన్న వాటిని నాశనం చేయడం ఇంకా మొదలుపెట్టలేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇకపై వంతెనలు, ఆ తర్వాత విద్యుత్‌ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌లో ఎత్తయిన వంతెనను పేల్చివేసిన వీడియోను కూడా జత చేశారు. ‘‘ఇరాన్‌లో పెద్ద వంతెన కూలిపోయింది. ఇకపై వినియోగించుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఇంకా ఇలా చాలా జరుగుతాయి. ఇరాన్‌ కొత్త నాయకత్వానికి ఏం చేయాలో తెలుసు. అది త్వరగా చేయాలి. ఇంకా ఆలస్యం కాకముందే ఒప్పందం కుదుర్చుకోవాలి. లేకపోతే.. గొప్ప దేశంగా మారే అవకాశమున్న ఇరాన్‌లో ఇక ఏమీ మిగలదు’’ అని ట్రంప్‌ హెచ్చరించారు.

Updated Date - Apr 04 , 2026 | 04:34 AM