Share News

ట్రంప్‌ లైంగికంగా వేధించారు

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:34 AM

వివాదాస్పద ఎప్‌స్టీన్‌ ఫైళ్లు మరికొన్ని అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. తాను మైనర్‌గా ఉండగా, డొనాల్డ్‌ ట్రంప్‌ లైంగిక వేధింపులకు గురి చేశారని ఓ మహిళ ఆరోపించిన అంశానికి సంబంధించిన....

ట్రంప్‌ లైంగికంగా వేధించారు

  • మైనర్‌గా ఉండగా ఎప్‌స్టీన్‌ ద్వారా పరిచయం

  • అసహజ శృంగారం కోసం నాపై ఒత్తిడి

  • ఓ మహిళ సంచలన ఆరోపణలు

  • మరికొన్ని ఎప్‌స్టీన్‌ ఫైళ్లు విడుదల

వాషింగ్టన్‌, మార్చి 6: వివాదాస్పద ఎప్‌స్టీన్‌ ఫైళ్లు మరికొన్ని అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. తాను మైనర్‌గా ఉండగా, డొనాల్డ్‌ ట్రంప్‌ లైంగిక వేధింపులకు గురి చేశారని ఓ మహిళ ఆరోపించిన అంశానికి సంబంధించిన పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి. తనను ట్రంప్‌కు ఎప్‌స్టీన్‌ పరిచయం చేశాడని ఎఫ్‌బీఐకు 2019లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆ మహిళ తెలిపారు. ‘‘నాకప్పుడు 13 నుంచి 15 ఏళ్లు ఉంటాయి. న్యూయార్క్‌ లేక న్యూజెర్సీలో నన్ను ట్రంప్‌కు ఎప్‌స్టీన్‌ పరిచయం చేశాడు. వారిద్దరూ నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ట్రంప్‌ అసహజ శృంగారం (ఓరల్‌ సెక్స్‌) కోసం నాపై ఒత్తిడి చేసేవారు’’ అని ఆమె తెలిపారు. ఎప్‌స్టీన్‌ వివాదం మొదలైన తర్వాత, ఈ విషయాలు బయటపెట్టవద్దని తనకు, తనకు సన్నిహితులైన వారికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, ఎప్‌స్టీన్‌కు సంబంధించి తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ట్రంప్‌ అప్పట్లోనే ఖండించారు. ఆ మహిళ సంచలనం కోసం ట్రంప్‌పై అసత్య ఆరోపణలు చేసినట్టు గతంలో విడుదల చేసిన ఫైళ్లలో కొందరు పేర్కొన్నట్టు నాడు న్యాయశాఖ తెలిపింది. దీంతో వాటిని పరిశీలనకు పంపుతున్నట్టు పేర్కొంది. తాజాగా వాటిని కూడా న్యాయశాఖ విడుదల చేయడం గమనార్హం. ఎప్‌స్టీన్‌ ఫైళ్లను ట్రంప్‌ యంత్రాంగం నిర్వహించిన తీరుపై ప్రతిపక్ష డెమోక్రట్లు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 04:34 AM