Share News

రహస్య ఫైళ్లను చాట్‌ జీపీటీలో అప్‌లోడ్‌ చేసిన ట్రంప్‌ ‘సైబర్‌ చీఫ్‌’

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:34 AM

అమెరికా ప్రభుత్వ సైబర్‌ నెట్‌వర్క్‌ని, రహస్యాలని నిరంతరాయంగా కాపాడే సంస్థ... సీఐఎ్‌సఏకు చెందిన ఫైళ్లు చాట్‌ జీపీటీలో అప్‌లోడ్‌ అయ్యాయి.

రహస్య ఫైళ్లను చాట్‌ జీపీటీలో అప్‌లోడ్‌ చేసిన ట్రంప్‌ ‘సైబర్‌ చీఫ్‌’

న్యూఢిల్లీ, జనవరి 29: అమెరికా ప్రభుత్వ సైబర్‌ నెట్‌వర్క్‌ని, రహస్యాలని నిరంతరాయంగా కాపాడే సంస్థ... సీఐఎ్‌సఏకు చెందిన ఫైళ్లు చాట్‌ జీపీటీలో అప్‌లోడ్‌ అయ్యాయి. ‘సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ’ (సీఐఎ్‌సఏ)కి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులై, ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేస్తున్న మధు గొట్టుముక్కల స్వయంగా ఆ ఫైళ్లను అప్‌లోడ్‌ చేయడం సంచలనంగా మారింది. ఆయన గత ఏడాది మేలో కార్యాలయంలో అత్యున్నత అధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్థకు చెందిన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ నుంచి చాట్‌ జీపీటీ వాడకానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఆ సమయంలో ఆ సంస్థలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులు ఎవరికీ చాట్‌ జీపీటీ వాడకానికి అనుమతి లేదు. చాట్‌ జీపీటీ వాడకానికి అనుమతి తీసుకున్న మధు దానిని దుర్వినియోగం చేశారు. ‘ఫర్‌ ఆఫీస్‌ యూజ్‌ ఓన్లీ’ అని నోట్‌ ఉన్న ఫైళ్లను మధు అప్‌లోడ్‌ చేయగానే ఆటోమేటెడ్‌ రక్షణ వ్యవస్థలు స్పందించాయి. ఆ ఫైళ్లలో సీఐఎ్‌సఏకి చెందిన కాంట్రాక్టు ఫైళ్లు కూడా ఉన్నాయి. ఆ ఫైళ్లలోని సమాచారం ఏదీ బహిర్గతం చేసేది కాదని డీహెచ్‌ఎస్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మధు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. తరువాత అమెరికాలో వివిధ యూనివర్శిటీల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంఎస్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు.

Updated Date - Jan 30 , 2026 | 03:34 AM