Share News

రష్యా-ఉక్రెయిన్‌ ఎనర్జీ సీజ్‌ఫైర్‌

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:51 AM

నాలుగున్నరేళ్లకు పైగా యుద్ధం చేస్తున్న రష్యా-ఉక్రెయిన్‌ ఎట్టకేలకు ఎనర్జీ సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయని, ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్‌ ఎనర్జీ సీజ్‌ఫైర్‌

  • ఒప్పందం తక్షణమే అమల్లోకి: ట్రంప్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 11: నాలుగున్నరేళ్లకు పైగా యుద్ధం చేస్తున్న రష్యా-ఉక్రెయిన్‌ ఎట్టకేలకు ఎనర్జీ సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయని, ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. రెండు దేశాలు విద్యుత్‌, చమురు, గ్యాస్‌ వంటి ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పరం దాడుల నిలిపివేతకు అంగీకరించాయని ఆయన వెల్లడించారు. పుతిన్‌ కనుక 60 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తే తాము ఎన్నికలు జరుపుకుంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎనర్జీ సీజ్‌ఫైర్‌ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా జెలెన్‌స్కీ ఎంతమాత్రం పనికిరారని, కొత్త వ్యక్తిని ఆ పదవికి ఎన్నుకోవడానికి ఇదే సరైన తరుణమని ట్రంప్‌ అన్నారు. జెలెన్‌స్కీ కారణంగా ఉక్రెయిన్‌ 30ు భూభాగం కోల్పోయిందని, 20లక్షల మంది మృతిచెందారని ఆరోపించారు.

Updated Date - Oct 12 , 2026 | 04:52 AM