Share News

గ్రీన్‌లాండ్‌కు హాస్పిటల్‌ నౌక

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:43 AM

తాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న డానిష్‌ భూభాగం గ్రీన్‌లాండ్‌కు హాస్పిటల్‌ నౌకను పంపేందుకుగాను లూసియానా గవర్నర్‌ జెఫ్‌ లాండ్రీతో కలిసి పని చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం పేర్కొన్నారు.

గ్రీన్‌లాండ్‌కు హాస్పిటల్‌ నౌక

  • పంపుతున్నామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 22: తాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న డానిష్‌ భూభాగం గ్రీన్‌లాండ్‌కు హాస్పిటల్‌ నౌకను పంపేందుకుగాను లూసియానా గవర్నర్‌ జెఫ్‌ లాండ్రీతో కలిసి పని చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం పేర్కొన్నారు. వైట్‌హౌ్‌సలో రిపబ్లికన్‌ గవర్నర్లకు విందు ఇవ్వడానికి ముందు ఈమేరకు సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న చాలా మందిని చూసుకోవడానికి గాను గ్రీన్‌లాండ్‌కు గొప్ప హాస్పిటల్‌ పడవను పంపబోతున్నామని, ఇది దారిలో ఉందని పేర్కొన్నారు. అయితే ఈ నౌకను డెన్మార్క్‌ కోరిందా.. లేదా గ్రీన్‌లాండ్‌ కోరిందా అన్న ప్రశ్నలకు వైట్‌హౌస్‌ గానీ లాండ్రీ కార్యాలయం గానీ స్పందించలేదు. గ్రీన్‌లాండ్‌ రాజధాని నూక్‌ వెలుపల 7నాటికల్‌ మైళ్ల దూరంలో గ్రీన్‌లాండ్‌ జలాల్లో అమెరికా సబ్‌మెరైన్‌ నుంచి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సిబ్బంది ఒకరిని తరలించినట్టు డెన్మార్క్‌ జాయింట్‌ అర్కిటిక్‌ కమాండ్‌ ప్రకటించిన కొన్ని గంటలకే ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. అయితే ట్రంప్‌ పోస్ట్‌కు దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేదానిపై స్పష్టతలేదు. అమెరికా నేవీకి రెండు హాస్పిటల్‌ నౌకలున్నాయి. వీటిలో ఒకటి మెర్సీ, రెండోది కంఫర్ట్‌. అయితే ఈ రెండింట్లో ఏది కూడా లూసియానాలో లేదని తెలుస్తోంది.

Updated Date - Feb 23 , 2026 | 01:43 AM