మనది చారిత్రక బంధం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:13 AM
భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్‌లు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రంప్, జిన్‌పింగ్ గణతంత్ర సందేశాలు
న్యూఢిల్లీ, జనవరి 26: భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా దేశాల ప్రజల తరఫున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తమ సందేశాల్లో పేర్కొన్నారు. ‘‘భారత్-అమెరికాలది చారిత్రక బంధం. ఇరు దేశాలు.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక, ఈ సందేశాన్ని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన అనంతరం.. సోమవారం మధ్యాహ్నం 2.14 గంటలకు భారత్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం పోస్టు చేయడం గమనార్హం. ‘‘మనం మంచి స్నేహితులం. మంచి భాగస్వాములం. మంచి ఇరుగు పొరుగు వారం. డ్రాగన్-ఏనుగు కలిసి నృత్యం చేయడం ఇరు దేశాలకు సరైన ఎంపిక’’ అని జిన్‌పింగ్ తన సందేశంలో పేర్కొన్నారు.