ప్రతి వయోజనుడికీ 5 వేల డాలర్లు
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:28 AM
అమెరికాలోని వయోజనులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ నజరానా ప్రకటించారు. మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి, ప్రతినిధుల సభ, సెనేట్‌లో ఆధిక్యతను అందిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు..
మధ్యంతర ఎన్నికల్లో గెలిపిస్తే ఇస్తా: ట్రంప్
భారీ నజరానాను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
పథకం అమలుకు లక్ష కోట్ల డాలర్లు అవసరం
ఇప్పటికే తీవ్ర ద్రవ్యలోటులో అమెరికా
వాషింగ్టన్, సెప్టెంబరు 10: అమెరికాలోని వయోజనులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ నజరానా ప్రకటించారు. మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి, ప్రతినిధుల సభ, సెనేట్‌లో ఆధిక్యతను అందిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు ఐదు వేల డాలర్లు (రూ.4.7 లక్షలు) చొప్పున ఇస్తానని ఆయన వెల్లడించారు. ‘ట్రంప్ డివిడెండ్’గా దీనిని ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తన పార్టీ తలరాతను మార్చేందుకు ట్రంప్ అసాధారణ రీతిలో రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. ఇందులోభాగంగానే వయోజన ఓటర్లకు ఎర వేశారు. అమెరికాలో 20 కోట్ల మందికిపైగానే వయోజనులు ఉన్నారు. వారందరికీ పథకం వర్తింపజేయాలంటే ఎంత లేదన్నా లక్ష కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాలి. ఇందుకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం తీవ్రమైన ద్రవ్యోల్బణ సమస్యతో ద్రవ్య నిర్వహణ అమెరికాలో భారంగా మారింది. 1.8 లక్షల కోట్ల డా లర్ల ద్రవ్యలోటును ఆ దేశం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వాగ్దానం మరింత భారమే కా నుంది. డాల్‌సలో జరిగిన పార్టీ సభలో ఆయన ఈ నజరానా ప్రకటించారు. ‘రిపబ్లికన్లు గెలిస్తే మీరు కూడా గెలుస్తారు. మీకు ట్రంప్ డివిడెండ్ లభిస్తుంది’ అని వెల్లడించారు.
మధ్యంతర ఎన్నికల తర్వాతే యుద్ధం ఆగుతుంది: ట్రంప్
అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ అన్నారు. డా లస్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో రాజకీయ అధికారం మారితే, అణ్వస్త్రం తయారీకి పరిస్థితులు తమకు సానుకూలపడతాయ ని ఇరాన్ ఆశ పెట్టుకుందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇక ఎక్కువకాలం దాడులను తట్టుకోలేదన్నారు.