పాక్‌లో లవ కుమారుడి ఆలయం పునరుద్ధరణ
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:12 AM
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో శ్రీరాముడి కుమారుడైన లవ కుమారుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. చారిత్రక లాహోర్ కోట వద్ద ఈ ఆలయం ఉంది.
లాహోర్, జనవరి 27: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో శ్రీరాముడి కుమారుడైన లవ కుమారుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. చారిత్రక లాహోర్ కోట వద్ద ఈ ఆలయం ఉంది. నగరంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా లవ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ తెలిపింది. వాస్తవానికి లవ కుమారుడి పేరుతోనే లాహోర్ నగరానికి ఆ పేరు వచ్చిందని హిందువులు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లో లవ కుమారుడి ఆలయం నిర్మించినట్లు చెబుతుంటారు.