Share News

సౌదీలో క్రియాశీలంగా తెలుగు సమాజం

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:15 AM

గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్న భారతీయుల్లో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసులు పాత్ర ప్రముఖమైందని భారతీయ రాయబారి విపుల్‌ ప్రశంసించారు.

సౌదీలో క్రియాశీలంగా తెలుగు సమాజం

  • తెలుగు దినోత్సవంలో సౌదీ భారతీయ రాయబారి విపుల్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్న భారతీయుల్లో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసులు పాత్ర ప్రముఖమైందని భారతీయ రాయబారి విపుల్‌ ప్రశంసించారు. గల్ఫ్‌ ప్రాంతంలోని తెలుగు ప్రవాసులు ఒక విశిష్ఠత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌’ అని తెలుగులో ఉచ్ఛరిస్తూ దీన్ని సార్థకం చేసిన వారు సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయులని అన్నారు. తెలుగు ప్రవాసీ సంఘం సాటా(సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌) బుధవారం రియాద్‌ నగరంలో తెలుగు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విపుల్‌ పాల్గొన్నారు. సాటా ప్రతినిధులు రంజీత్‌ చిత్తలూరి, జానీ బాషా, ముజ్జమ్మీల్‌ శేఖ్‌, సుచరిత, చేతన, ఎర్రన్న, యాకూబ్‌, నాగరాజు, సత్తిబాబు తదితరులు సాటా కార్యకలాపాలను వివరించారు.

Updated Date - Sep 24 , 2026 | 06:15 AM