అమెరికా మిచిగాన్‌లో దుండగుడి కాల్చివేత
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:17 AM
అమెరికాలోని ఓ యూదుల ప్రార్థనా మందిరంపై దాడికి యత్నించిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. వాహనం నిండా పేలుడు పదార్థాలతో దూసుకువచ్చి...
యూదుల ప్రార్థనా మందిరంపై దాడికి యత్నం
మిచిగాన్, మార్చి 12: అమెరికాలోని ఓ యూదుల ప్రార్థనా మందిరంపై దాడికి యత్నించిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. వాహనం నిండా పేలుడు పదార్థాలతో దూసుకువచ్చి మందిరం భవనాన్ని ఢీకొట్టడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అనుమానితుడు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఘటన మిచిగాన్‌లోని డెట్రాయిట్ శివార్లలో జరిగింది. ఇదే మందిరం ఆవరణలో చిన్నారుల సంరక్షణ కేంద్రంతో పాటు పాఠశాల కూడా ఉన్నట్లు సమాచారం. ఘటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.