Share News

విదేశీ కార్లపై శ్రీలంకలో 50శాతం సర్‌ఛార్జి

ABN , Publish Date - May 17 , 2026 | 05:59 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దృష్ట్యా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడంతోపాటు, కరెన్సీ విలువ పడిపోకుండా చూసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.

విదేశీ కార్లపై శ్రీలంకలో 50శాతం సర్‌ఛార్జి

కొలంబో, మే 16: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దృష్ట్యా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడంతోపాటు, కరెన్సీ విలువ పడిపోకుండా చూసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కనీసం మూడు నెలల పాటు విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకోకుండా నిరుత్సాహ పరచాలని విధానపర నిర్ణయం తీసుకొంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లపై 50 శాతం సర్‌ఛార్జి విధిస్తూ ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ కార్లపై ప్రస్తుతం 30 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తుండగా, దానికి అదనంగా 50 శాతం సర్‌ఛార్జి వసూలు చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల దిగుమతులను తాత్కాలికంగా వాయిదా వేయించడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోటారు సైకిళ్లు, ఆటోలకు మాత్రం మినహాయింపు ఉన్నట్టు పేర్కొన్నాయి.

Updated Date - May 17 , 2026 | 06:01 AM