దివి నుంచి దిగివచ్చిందీ.. రాకెట్ బ్యూటీ
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:39 AM
అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. భూమి నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ ‘స్టార్‌షిప్’ 22 గంటల అంతరిక్ష యానం తర్వాత తిరిగి సురక్షితంగా ల్యాంచ్‌ప్యాడ్‌కు చేరింది.
22 గంటల అంతరిక్ష యానం తర్వాత ల్యాంచ్‌ప్యాడ్‌కు తిరిగొచ్చిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్
టెక్సస్, నవంబరు 15: అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. భూమి నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ ‘స్టార్‌షిప్’ 22 గంటల అంతరిక్ష యానం తర్వాత తిరిగి సురక్షితంగా ల్యాంచ్‌ప్యాడ్‌కు చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున అమెరికా, టెక్స్‌సలోని ల్యాంచ్ బేస్‌కు చేరుకోగా.. రాకెట్ గాలిలో ఉన్నప్పుడే యాంత్రిక చేతులు(చాప్ స్టిక్స్) దానిని పట్టుకున్నాయి. సాధారణంగా భూమి నుంచి అంతరిక్షలోకి ప్రయోగించిన రాకెట్లు తిరిగి వచ్చేటప్పుడు సముద్రంలో కూలిపోతుంటాయి. అయితే, టెక్స్‌సలోని స్టార్ బేస్ నుంచి నవంబరు 13న(అమెరికా కాలమానం ప్రకారం) స్పేస్‌ఎక్స్‌కు చెందిన భారీ రాకెట్ స్టార్‌షి్‌పను ప్రయోగించారు. సుమారు 22 గంటలు అంతరిక్షంలో ప్రయాణించిన ఈ రాకెట్.. భూమి చుట్టూ 14 సార్లు తిరిగింది. ప్రయోగంలో భాగంగా 26 స్టార్‌లింక్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అనంతరం తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున తిరిగి భూమికి చేరుకోగా లాంచ్ టవర్‌లోని చాప్‌స్టిక్స్ ఆ రాకెట్‌ను పట్టుకున్నాయి. నిజానికి, ఈ ప్రయోగంలో స్పేస్ ఎక్స్ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. రాకెట్‌లో పైన ఉండే స్టార్ షిప్‌తోపాటు దిగువన ఉండే బూస్టర్.. రెండింటిని స్పేస్‌ఎక్స్ పట్టుకోవాలి అనుకుంది. కానీ, బూస్టర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో కూలింది. స్పేస్ ఎక్స్ విజయం రాకెట్ల పునర్వినియోగంపై జరుగుతున్న ప్రయోగాలకు కొత్త శక్తినిచ్చింది.