Share News

8 గంటల్లోనే అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:00 AM

అమెరికా అంతరిక్ష చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని నమోదు చేస్తూ నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి చేరుకున్నారు.

8 గంటల్లోనే అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం

కేప్‌ కెనవెరల్‌, అక్టోబరు 2: అమెరికా అంతరిక్ష చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని నమోదు చేస్తూ నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-13 మిషన్‌లో భాగంగా ‘గ్రేస్‌’ అని పిలిచే అంతరిక్ష నౌక డ్రాగన్‌ 8గంటల్లోపే వ్యోమగాములను ఐఎస్ఎస్ కు చేర్చి రికార్డు సృష్టించింది. ఫ్లోరిడాలోని కేప్‌ కెనవెరల్‌ నుంచి నింగిలోకి ఎగిరిన 7 గంటల 55 నిమిషాల్లోనే ఈ రాకెట్‌ నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్ కు విజయవంతంగా చేర్చింది. అమెరికాకు చెందిన ఒక రాకెట్‌ ఇంత వేగంగా ఐఎస్ఎస్ కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ప్రయాణానికి నాసాకు చెందిన జెస్సికా వాట్కిన్స్‌ కమాండర్‌గా వ్యవహరించారు. దీంతో స్పేస్‌లోకి వ్యోమగాముల బృందాన్ని నడిపించిన తొలి శ్వేతజాతీయేతర (నల్లజాతి) మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

Updated Date - Oct 03 , 2026 | 03:02 AM