Share News

దక్షిణ సుడాన్‌లో బంగారు గనిపై దుండగుల దాడి

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:55 AM

దక్షిణ సుడాన్‌ రాజధాని జుబా శివారులోని ఓ బంగారు గని వద్ద జరిగిన వివాదం హింసాత్మకంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆకస్మికంగా కాల్పులకు పాల్పడడంతో ...

దక్షిణ సుడాన్‌లో బంగారు గనిపై దుండగుల దాడి

  • 70 మంది మృతి, అనేక మందికి గాయాలు

జుబా, మార్చి 30: దక్షిణ సుడాన్‌ రాజధాని జుబా శివారులోని ఓ బంగారు గని వద్ద జరిగిన వివాదం హింసాత్మకంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆకస్మికంగా కాల్పులకు పాల్పడడంతో 70 మందికి పైగా మృతి చెందారు. సెంట్రల్‌ ఈక్వటోరియా రాష్ట్రంలోని జెబెల్‌ ఇరాక్‌ అనే బంగారు గని వద్ద ఆదివారం ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో కొంతకాలంగా అక్రమ మైనింగ్‌ చేస్తున్న వారికి మైనింగ్‌ కంపెనీలకు మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 31 , 2026 | 04:55 AM