Share News

భారత్‌, చైనా వాహనాలపై 50 శాతం దాకా సుంకాలు!

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:26 AM

రానున్న కాలంలో దక్షిణాఫ్రికాకు వాహనాలను ఎగుమతి చేసే భారత ఆటోమొబైల్‌ కంపెనీలపై ప్రభావం పడే సంకేతాలు కనిపిస్తున్నాయి..

భారత్‌, చైనా వాహనాలపై 50 శాతం దాకా సుంకాలు!

  • విధించే అంశాన్ని పరిశీలిస్తున్న దక్షిణాఫ్రికా

న్యూఢిల్లీ, జనవరి 28: రానున్న కాలంలో దక్షిణాఫ్రికాకు వాహనాలను ఎగుమతి చేసే భారత ఆటోమొబైల్‌ కంపెనీలపై ప్రభావం పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌, చైనా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై 50శాతం వరకు సుంకాలను విధించే అంశాన్ని ఆ దేశం పరిశీలిస్తున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశాన్ని దక్షిణాఫ్రికా వాణిజ్య, పరిశ్రమ, పోటీ శాఖ సమీక్షిస్తున్నట్టు సమాచారం. దక్షిణాఫ్రికాకు భారత్‌, చైనా దేశాలు భారీగానే వాహనాలను ఎగుమతి చేస్తున్నాయి. 2024లో ఈ రెండు దేశాలు దక్షిణాఫ్రికాకు అతిపెద్ద వాహన సరఫరాదారులుగా నిలిచాయి. దేశ మొత్తం దిగుమతుల్లో భారత్‌ వాటా 53శాతం, చైనా వాటా 22శాతం ఉంది. గత నాలుగేళ్లలో చైనా నుంచి దిగుమతులు 368ు, భారత్‌ నుంచి దిగుమతులు 135ు పెరిగాయి.

Updated Date - Jan 29 , 2026 | 03:26 AM