Share News

16న వస్తా.. విమానం ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:31 AM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే తేదీని ప్రకటించారు. 1971 విముక్తి పోరాటంలో పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబరు..

16న వస్తా.. విమానం ఏర్పాటు చేయండి

  • బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి షేక్‌ హసీనా విజ్ఞప్తి

ఢాకా, నవంబరు 24: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే తేదీని ప్రకటించారు. 1971 విముక్తి పోరాటంలో పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబరు 16న నిర్వహించే విజయ్‌ దివస్‌ సందర్భంగా హసీనా ఢాకాకు వెళ్లాలని యోచిస్తున్నారని ఆమె ప్రతినిధి సయ్యద్‌ మొజెమ్మెల్‌ అలీ మంగళవారం తెలిపారు. జాతీయ విమానయాన సంస్థ బిమాన్‌లో ఢిల్లీ నుంచి తన తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని బంగ్లా ప్రభుత్వానికి హసీనా(79) విజ్ఞప్తి చేశారని చెప్పారు. అందుకు ఆవసరమైన ప్రయాణ పత్రాలు అందించాలని ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ను కోరారని సయ్యద్‌ వెల్లడించారు.

Updated Date - Nov 25 , 2026 | 03:33 AM