ఈ ఏడాదే స్వదేశానికి వెళ్తా
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:16 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్టు ప్రకటించారు. చావంటే తనకు భయం లేదని వెల్లడించారు.
చావంటే భయం లేదు: హసీనా
న్యూఢిల్లీ, జూన్ 28: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్టు ప్రకటించారు. చావంటే తనకు భయం లేదని వెల్లడించారు. దాదాపు రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌ను వీడిన ఆమె అప్పటి నుంచి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఓ ఆంగ్ల టీవీ చానల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమెకు మరణశిక్ష విధిస్తూ గత ఏడాది నవంబరులో బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తీర్పిచ్చింది. తన పార్టీ ఆవామీ లీగ్‌ను నాయకత్వ రహితం చేసే కుట్రతో తీర్పు ఇచ్చారని హసీనా ఆరనోపించారు. అలాంటి కుట్రలు సఫలం కాబోవన్నారు.