Share News

సూడాన్‌లో 4 లక్షల చిన్నారులకు ప్రాణాపాయం!

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:12 AM

హోర్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా.. సూడాన్‌లో 4 లక్షల మంది చిన్నారులకు అందాల్సిన మందులు పశ్చిమాసియాలో చిక్కుకుపోయినట్టు సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ...

సూడాన్‌లో 4 లక్షల చిన్నారులకు ప్రాణాపాయం!

హోర్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా.. సూడాన్‌లో 4 లక్షల మంది చిన్నారులకు అందాల్సిన మందులు పశ్చిమాసియాలో చిక్కుకుపోయినట్టు సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ వెల్లడించింది. సూడాన్‌లో చిన్నారులకు అందించేందుకు సరఫరా అవుతున్న యాంటీ బయాటిక్స్‌, యాంటీ మలేరియా మందులు, డీవార్మింగ్‌ మందులు, వ్యాక్సిన్లు, పోషక పదార్థాలు వంటివి దుబాయ్‌, యూఏఈలలో నిలిచిపోయినట్టు తెలిపింది. దీనితో సూడాన్‌లో చిన్నారులకు వైద్యం అందించే వందలాది ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు అందే పరిస్థితి లేకుండా పోయిందని వెల్లడించింది. అటు యెమెన్‌కు, అఫ్ఘానిస్థాన్‌కు అందాల్సిన మందులు, ఔషధాలు కూడా నిలిచిపోయాయని పేర్కొంది. పెరిగిన రవాణా చార్జీల కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకూ ఇబ్బంది ఎదురవుతోందని తెలిపింది. అఫ్ఘానిస్థాన్‌కు అత్యవసరంగా మందులు పంపేందుకు రూ.223 కోట్లు (2.4లక్షల డాలర్లు) ఖర్చు చేయాల్సి వచ్చిందని, మందుల ధర కంటే ఈ వ్యయమే ఎక్కువని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..

మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 19 , 2026 | 06:12 AM