Share News

భారత్‌ సహా 40 దేశాల పౌల్ర్టీదిగుమతులపై సౌదీ నిషేధం

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:01 AM

భారత్‌ సహా 40 దేశాల పౌల్ర్టీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా పూర్తిస్థాయి నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ సహా కోళ్లకు సంబంధించిన వ్యాధులపై ఆందోళనలు నెలకొన్న...

భారత్‌ సహా 40 దేశాల పౌల్ర్టీదిగుమతులపై సౌదీ నిషేధం

దుబాయి, ఫిబ్రవరి 25: భారత్‌ సహా 40 దేశాల పౌల్ర్టీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా పూర్తిస్థాయి నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ సహా కోళ్లకు సంబంధించిన వ్యాధులపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీకి చెందిన ఒక అరబిక్‌ పత్రిక పేర్కొంది. మరో 16 దేశాలకు చెందిన కొన్ని రాష్ట్రాలు, నగరాల పౌల్ర్టీ ఉత్పత్తులపై పాక్షికంగా పరిమితులు విధించినట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల పరిస్థితిపై నిరంతర పరిశీలన ఆధారంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. వీటిలో కొన్ని దేశాలపై 2004 నుంచే నిషేధం కొనసాగుతోందని, తాజా ముప్పు అంచనా మేరకు మరికొన్ని దేశాలను జాబితాలో చేర్చినట్టు పేర్కొంది. నిషేధం ఎదుర్కొంటున్న దేశాల్లో చైనా, ఇరాక్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, జర్మనీ, ఇండోనేసియా, మయన్మార్‌, బ్రిటన్‌, ఈజిప్టు, మెక్సికో, పాలస్తీనా, జపాన్‌, హాంకాంగ్‌ తదితరాలు ఉన్నాయి. ఆయా దేశాలకు చెందిన కోళ్లు, గుడ్లపై పూర్తిస్థాయి నిషేధం విధించారు.

Updated Date - Feb 26 , 2026 | 02:01 AM