Share News

ఉక్రెయిన్‌తో యుద్ధంలో 7 లక్షల మంది రష్యా సైనికుల మృతి!

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:22 AM

ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యా సైన్యానికి తీరని నష్టాన్ని మిగులుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న పోరులో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో 7 లక్షల మంది రష్యా సైనికుల మృతి!

  • లీకైన ప్రభుత్వ డేటా విశ్లేషణతో వెలుగులోకి సంచలన నిజాలు

మాస్కో, నవంబరు 24: ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యా సైన్యానికి తీరని నష్టాన్ని మిగులుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న పోరులో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2026 సెప్టెంబరు నాటికి కనీసం 4.9 లక్షల మంది రష్యా సైనికుల మరణాలు అధికారిక రికార్డుల్లో నమోదైనట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే, వాస్తవ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్వతంత్ర మీడియా సంస్థలైన ‘మెడూజా’, ‘మీడియాజోనా’ తమ విశ్లేషణలో పేర్కొన్నాయి. అధికారికంగా నమోదు కాని మరణాలు, గల్లంతైన సైనికుల వివరాలను కూడా కలుపుకుంటే మృతుల సంఖ్య 7 లక్షలకు పైగా ఉండవచ్చని ఈ సంస్థలు అంచనా వేశాయి. రష్యా ప్రభుత్వ గణాంకాల సంస్థ ‘రోస్టాట్‌’ నుంచి హ్యాకర్ల ద్వారా లీకైన డేటాను విశ్లేషించి ఈ వివరాలను బటయపెట్టాయి. మరోవైపు, యుద్ధం ఒత్తిడి కారణంగా సైనికుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 1,200మందికి పైగా రష్యా సైనికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేధింపులు, అత్యంత ప్రమాదకరమైన యుద్ధ కార్యకలాపాలకు పంపుతారనే భయాలే సైనికుల బలవన్మరణానికి కారణాలుగా భావిస్తున్నారు.

Updated Date - Nov 25 , 2026 | 04:23 AM