ఉక్రెయిన్‌లో 5 లక్షల మంది రష్యా సైనికుల మృతి
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:17 AM
నాలుగున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శత్రుదేశం ఉక్రెయిన్‌లోనే 5లక్షల మంది రష్యా సైనికులు చనిపోయారని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) వైమానిక దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సర్ రిచర్డ్ నైటన్ తెలిపారు.
యూకే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నైటన్ వెల్లడి
కీవ్, సెప్టెంబరు 11: నాలుగున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శత్రుదేశం ఉక్రెయిన్‌లోనే 5లక్షల మంది రష్యా సైనికులు చనిపోయారని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) వైమానిక దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సర్ రిచర్డ్ నైటన్ తెలిపారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 15 లక్షల మంది రష్యా సైనికులు చనిపోయినట్లు శుక్రవారం వెల్లడించారు. 10వేల సాయుధ వాహనాలు, 3వేల గగన రక్షణ, ఆర్టిలరీ వ్యవస్థలు, 370కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు రష్యా కోల్పోయిందని తెలిపారు. భారీ నష్టం కారణంగా ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌లో రష్యా మిలిటరీ దూకుడు చాలావరకు తగ్గిందని చెప్పారు. అయితే, ఉక్రెయిన్‌కు ఎంత నష్టం వాటిల్లిందనే విషయం మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రోన్ దాడుల్లో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు.