Share News

ఇరాన్‌పై యుద్ధం.. గెలిచినది రష్యా!

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:46 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు విజయం సాధించినది ఒక్క రష్యానే అని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో ....

ఇరాన్‌పై యుద్ధం.. గెలిచినది రష్యా!

  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధర పెరిగింది

  • రష్యా చమురుపై ఆంక్షలు తొలిగాయి

  • ఉక్రెయిన్‌పై యుద్ధం అంశం మరుగునపడింది

  • యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా

బ్రసెల్స్‌, మార్చి 10: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు విజయం సాధించినది ఒక్క రష్యానే అని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వ్యాఖ్యానించారు. బెల్జియంలోని బ్రసెల్స్‌లో జరుగతుఉన్న యూరోపియన్‌ యూనియన్‌ దౌత్యవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆంక్షల నుంచి ఉపశమనం లభించి, చమురు ధరలు పెరిగి ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యాకు మరిన్ని ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. ఉక్రెయిన్‌కు అందేందుకు అవకాశాలున్న ఆయుధాలన్నీ పశ్చిమాసియాకు తరలుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల అంశం మరుగునపడిపోయి పశ్చిమాసియాపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటివరకు ఒక్క రష్యాకే గెలుపు దక్కింది’’ అని ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు. స్వేచ్ఛ, మానవ హక్కులు అనేవి బాంబులతో సాధించేవి కావని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలోని దేశాలన్నీ చర్చలు జరిపి సంక్షోభాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 11 , 2026 | 03:46 AM