Geopolitical Tensions: పుతిన్ ఇంటిపై దాడి..
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:48 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది.
వీడియోను విడుదల చేసిన రష్యా
మాస్కో, డిసెంబరు 31: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. పుతిన్ ఇంటి సమీపంలో ఓ డ్రోన్ కూలిపోయి ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ డ్రోన్‌ను ఉక్రెయినే ప్రయోగించిందని, తాము కూల్చివేశామని రష్యా ఆరోపిస్తోంది. డ్రోన్‌లో 6కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారని తెలిపింది. ఈ దాడిలో పుతిన్ నివాసానికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అయితే, ఈ వీడియో నకిలీదని, కల్పితమని ఉక్రెయిన్ కొట్టిపారేసింది.