జెలెన్‌స్కీ.. శాంతి చర్చలకు మాస్కోకి రండి!
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:44 AM
రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి...
ఉక్రెయిన్ అధ్యక్షుడికి రష్యా మళ్లీ పిలుపు
మాస్కో, జనవరి 30: రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. శాంతి చర్చల కోసం మాస్కోకు రావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా మరోమారు ఆహ్వానించింది. అయితే, తమ ఆహ్వానంపై ఉక్రెయిన్ నుంచి స్పందన లేదని, జెలెన్‌స్కీ పర్యటనపై తమకు సమాచారం లేదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెసోవ్ విలేకరులతో అన్నారు. అయితే, శాంతిచర్చల కోసం తమ దేశానికి రావాలని రష్యా గతేడాది చేసిన ప్రతిపాదనను జెలెన్‌స్కీ అప్పట్లో తిరస్కరించారు. కాగా, ట్రంప్ వ్యక్తిగతంగా చేసిన వినతి మేరకు ఫిబ్రవరి 1 వరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులు చేయకుండా ఉండేందుకు అంగీకరించామని రష్యా తెలిపింది.